గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో అజయ్ దేవగన్

దిశ,మునుగోడు: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బాలీవుడ్ సుప్రీమ్ హీరో అజయ్ దేవగన్ లు కలిసి దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మల్కాపురం చేరుకున్న ఎంపీ సంతోష్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలు, ఒగ్గు కళాకారులతో స్వాగతం పలికారు. ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గ్రీన్ […]

Update: 2021-01-07 06:48 GMT

దిశ,మునుగోడు: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బాలీవుడ్ సుప్రీమ్ హీరో అజయ్ దేవగన్ లు కలిసి దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మల్కాపురం చేరుకున్న ఎంపీ సంతోష్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలు, ఒగ్గు కళాకారులతో స్వాగతం పలికారు. ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తిచేసింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు అజయ్ దేవగన్‌కు చెందిన ఎన్.వై ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో వంద మంది పారిశ్రామిక వేత్తలు, 110 మంది కళాకారులు,మూడు వందల మంది స్థానికులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ… తనకు మొక్కలు, పచ్చదనం అంటే చాలా ఇష్టమని తెలిపారు. సమాజం వ్యాపారీకరణతో కాలుష్యకాసారంగా మారడం తీవ్రంగా కలచివేస్తోందని చెప్పారు. అభివృద్ధి ఎంత అవసరమో.. పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరం అన్నారు. అందుకే తనకు తోచిన విధంగా ఎన్.వై ఫౌండేషన్స్ స్థాపించి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించానన్నారు.

Tags:    

Similar News