వర్షాకాలంలో ఇవి అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలంలో కారం బాగాలాగిస్తున్నారా… అయితే ఇకపై అలా చేయకండి. వర్షాకాలంలో వేడివేడిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవచ్చు. కానీ కారం అధికంగా చేర్చిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. శీతాకాలంలో, వర్షాకాలంలో సులవుగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవాలి. అందువల్ల ఈ కాలంలో బజ్జీలు, పకోడిలు, బర్గర్‌లాంటి చిరుతిండ్లు తింటే అరుగుదల కష్టమవుతుంది. కాబట్టి వానాకాలంలో చిరుతిండ్ల జోలికిపోకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. శాఖాహరమైన, మాంసహారమైన వానాకాలంలో డీప్ ఫ్రై లాంటివి చేసుకొని తినకూడదు. […]

Update: 2021-07-12 20:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలంలో కారం బాగాలాగిస్తున్నారా… అయితే ఇకపై అలా చేయకండి. వర్షాకాలంలో వేడివేడిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవచ్చు. కానీ కారం అధికంగా చేర్చిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. శీతాకాలంలో, వర్షాకాలంలో సులవుగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవాలి. అందువల్ల ఈ కాలంలో బజ్జీలు, పకోడిలు, బర్గర్‌లాంటి చిరుతిండ్లు తింటే అరుగుదల కష్టమవుతుంది. కాబట్టి వానాకాలంలో చిరుతిండ్ల జోలికిపోకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. శాఖాహరమైన, మాంసహారమైన వానాకాలంలో డీప్ ఫ్రై లాంటివి చేసుకొని తినకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్ధాల వల్ల దగ్గు, యాసిడిటీ లాంటి సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. వర్షాకాలంలో అప్పటికప్పుడు పండ్లను కట్ చేసుకొని తీసుకోవాలి.

భారీ వర్షాల సమయంలో చేపలు, రొయ్యలు తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా లాంటి జబ్బుల బారినపడే అవకాశం లేకపోలేదు. వర్షాకాలంలో ఎలర్జీ సమస్యలు కూడా బాగా వేధిస్తుంటాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే కూరల్లో కొంచెం కారం తక్కువ వాడడం మంచిది. ఎలర్జీలకు తరుచూ గురయ్యేవారు కారం చాలా తక్కువ తీసుకోవడం ఉత్తమమైన విషయం. ఎలర్జీ, జలుబు, దగ్గు, సైనటిస్, మైగ్రేన్, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో పాల ఉత్పత్తులు ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ వర్షాకాలంలో చికెన్, మటన్ లాంటివి ఎక్కువగా ఉడికించి, సూప్‌లాగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Similar News