ఓరుగల్లులో జోరువాన

దిశ, వరంగల్‌: ఓరుగల్లులో జోరువాన కురుస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చినా.. బుధవారం రాత్రి నుంచి పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, వివేకానందకాలనీ, సాయి గణేష్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధుర్ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఇటీవల కురిసిన భీకర వర్షాలకు హన్మకొండలోని ప్రధాని రహదారి […]

Update: 2020-08-19 23:19 GMT

దిశ, వరంగల్‌: ఓరుగల్లులో జోరువాన కురుస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చినా.. బుధవారం రాత్రి నుంచి పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.

వర్షం కారణంగా నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, వివేకానందకాలనీ, సాయి గణేష్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధుర్ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఇటీవల కురిసిన భీకర వర్షాలకు హన్మకొండలోని ప్రధాని రహదారి హంటర్ రోడ్డు సైతం నీట మునిగిన సంగతి తెలిసిందే. స్థానికులు సైతం దారి మరిచేలా రోడ్లు చెరువులను తలపించడం గమనార్హం.

Tags:    

Similar News