వరంగల్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం..
దిశ ప్రతినిధి, వరంగల్ : మూడు గంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి వరంగల్ పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. కొన్ని ప్రధాన రోడ్లపై మోకాల్లోతు వరద నీరు ప్రవహించడం గమనార్హం. ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో జనం అవస్తలు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాన నాలాలు, వాటికి అనుసంధానమైన కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టడంతో వరద నీరు ఎప్పటికప్పుడు నగరం బయటకు వెళ్తోంది. అయితే ఇంకా వందలాది […]
దిశ ప్రతినిధి, వరంగల్ : మూడు గంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి వరంగల్ పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. కొన్ని ప్రధాన రోడ్లపై మోకాల్లోతు వరద నీరు ప్రవహించడం గమనార్హం. ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో జనం అవస్తలు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాన నాలాలు, వాటికి అనుసంధానమైన కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టడంతో వరద నీరు ఎప్పటికప్పుడు నగరం బయటకు వెళ్తోంది. అయితే ఇంకా వందలాది కాలనీల్లోని అంతర్గత డ్రెయినేజీల నిర్మాణం లేకపోవడం, ఉన్నచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకుపోవడం వంటి కారణాల చేత వరద నీరు బ్లాక్వుతోంది.
ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
జలమయమైన ప్రాంతాల్లో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బల్దియా మేయర్ గుండు సుధారాణిలు తెలిపారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ, 9701999645 మొబైల్, 7997100300 వాట్స్ అప్ నంబర్‌లను సద్వినియోగించుకొని సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమస్యలకు సంబంధించిన ఫోటోలను వాట్సాప్కు పంపి, ఆ ప్రాంతం ఏ డివిజన్‌లో ఉందో తెలియజేస్తే బల్దియా డీ.ఆర్.ఎఫ్.సిబ్బంది, అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.