భాగ్యనగరంలో భారీ వర్షం..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుండి విరామం తీసుకున్న వరుణుడు తిరిగి సాయంత్రం విజృంభించాడు. దీంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ కిందస్థలాన్ని ఆశ్రయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు […]

Update: 2021-07-18 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుండి విరామం తీసుకున్న వరుణుడు తిరిగి సాయంత్రం విజృంభించాడు. దీంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ కిందస్థలాన్ని ఆశ్రయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News