మహిళల్లో పెరుగుతున్న థైరాయిడ్​.. ముందే ఎలా గుర్తించాలంటే?

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. దీని వలన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మానసికంగా, శారీరకంగా స్త్రీలను కుంగదీస్తుంది. అయితే చాలా మంది ఈ థైరాయిడ్ లక్షణాలను గుర్తించడంలో

Update: 2024-05-18 09:49 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. దీని వలన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మానసికంగా, శారీరకంగా స్త్రీలను కుంగదీస్తుంది. అయితే చాలా మంది ఈ థైరాయిడ్ లక్షణాలను గుర్తించడంలో విఫలం అవుతున్నారు. దీంతో వారు సమస్యను తీవ్రతరం చేసుకొని, సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కాగా థైరాయిడ్ సమస్యను ముందుగా ఎలా గుర్తించాలి. దాని ప్రారంభ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీకేర్ ఫుల్ ఈ సంకేతాలు కనిపిస్తే నెగ్లెట్ చేయోద్దు!

  • ప్రతి మహిళకు నెలసరి రావడం అనేది కామన్. అయితే పీరియడ్స్‌లో మార్పు కనిపించినట్లైతే అనుమానించాల్సిన విషయమే. బ్లీడింగ్ అధికంగా కావడం లేదా తక్కువ కావడం, లేట్ పీరియడ్స్, ఎర్లీ పీరియడ్స్ ఇలా ఎలాంటి మార్పు కనిపించినా నెగ్లెట్ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా థైరాయిడ్ సంకేతం కావచ్చు.

  • మీరు ఉన్నట్లుండి బరువు తగ్గినా లేదా బరువు పెరిగినా అది కూడా అనారోగ్యకరమైన సమస్యనే. కొంత మంది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలన బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. అందువలన ఇలాంటి ప్రాబ్లం ఎదురైనా అనుమానించాల్సిన విషయమే.

  • థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తాయి. అందువలన మీరు కొద్ది పనికే అలసిపోవడం, ఇబ్బంది పడటం, నీరసం వంటివి ఉంటే థైరాయిడ్ ప్రారంభ లక్షణంగా మనించాలి.

  • అలాగే చర్మం పొడిబారడం, గోర్లు రాలిపోవడం, మూడ్ స్వింగ్స్‌లో మార్పు, గుండె స్పందనలో మార్పు, మెడ వాపు, నిద్రలేమిచ కొన్ని సార్లు వట్టి వట్టిగనే కల్లు తిరిగినట్లు అనిపించడం ఇవన్నీ కూడా థైరాయిడ్ ప్రారంభ లక్షణాలే. అందువలన వీటిలో మీకు ఏ లక్షణం కనిపించినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Similar News