రాత్రంతా AC ఆన్‌ చేసి నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు ఎదుర్కొనేందుకు రెడీగా ఉండండి..

ప్రస్తుత కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 అయ్యిందంటే చాలు భానుడు భగభగ లాడుతూ మండిపోతున్నాడు.

Update: 2024-05-10 13:16 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 అయ్యిందంటే చాలు భానుడు భగభగ లాడుతూ మండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఉదయాన్నే బయటకు వెళ్లేందుకు ఎంతగానో భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే ఇంట్లోనే వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రజలు కూలర్లు, ఏసీలను అతిగా వినియోగిస్తున్నారు. అయితే అతిగా ఏసీల్లో ఉండడం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రంతా ఏసీలను ఆన్ చేసి నిద్రపోవడం వలన ఉదయాన్నే శరీరం వెచ్చగా ఉంటుందట. అంతే కాదు ఉదయం నిద్రలేచే సమయానికి శరీరం పూర్తిగా బిగుసుకుపోయినట్లుగా ఉండి ఒంటి నొప్పి కూడా వస్తుందట. అంతేకాదు అతిగా ఏసీలో ఉండడం వలన ఎముకల పై ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. ఏసీలో ఉండి ఉండి బయటికి వెళితే బయటి ఉష్ణోగ్రతను తట్టుకోలేరని చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడం పై కూడా ప్రభావాలు చూపుతాయని, ముక్కు కారటం, దగ్గు, ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

నిత్యం ACలో నిద్రపోతే కంటి అలెర్జీలు, చర్మం పొడిబారటం వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందట. అంతే కాదు మచ్చలు, దురద సమస్యలు కూడా వస్తాయంటున్నారు. అలర్జిక్ రైనైటిస్ లాంటి సమస్యలు కూడా వస్తుందట. అందుకే గది చల్లబడేవరకు మాత్రమే ఏసీ ఆన్‌ తరువాత ఆఫ్ చేయడం మంచిదంటున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News