ఉదయాన్నే వేడి వేడి టీ తాగితే ఎంత డేంజరో తెలుసా?

ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక కొంత మందకి పొద్దున టీ తాగనిదే ఆరోజే గడవనట్లు అనిపిస్తుంది. అయితే కొంత మంది వేడి వేడిగా తాగుతుంటారు. అయితే అలా తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.

Update: 2023-05-16 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక కొంత మందకి పొద్దున టీ తాగనిదే ఆరోజే గడవనట్లు అనిపిస్తుంది. అయితే కొంత మంది వేడి వేడిగా తాగుతుంటారు. అయితే అలా తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ఉదయాన్నే వేడి టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చచూద్దాం.

చాలా వేడిగా చాయ్ తాగితే అలవాటున్నట్టైంతే వెంటనే దాన్ని మానుకోండి. లేకపోతే ఇలా అతివేడి గా ఉన్న టీ తాగితే ఓ రకమైన క్యాన్సర్ వస్తుంది అంంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ 75డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీ తాగే వారికి esophageal cancer వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ఒక్క త్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయంట. అందువలన వీలైనంత వరకు వేడి వేడి టీ తాగడం మానుకోవాలంట.

Tags:    

Similar News