8,356 కరోనా కేసులు.. 273 మరణాలు : కేంద్రం

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు రోజులుగా దాదాపు వెయ్యికి సమీపంగా రిపోర్ట్ అయ్యాయి. తాజాగా, దేశంలో కరోనా కేసులు ఎనిమిది వెయ్యిల మార్క్‌ను దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,356కు పెరిగాయి. కాగా, మరణాలు 273కి చేరాయి. 716 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లోనే 909 కేసులు కొత్తగా నమోదవ్వగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారని […]

Update: 2020-04-12 01:23 GMT

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు రోజులుగా దాదాపు వెయ్యికి సమీపంగా రిపోర్ట్ అయ్యాయి. తాజాగా, దేశంలో కరోనా కేసులు ఎనిమిది వెయ్యిల మార్క్‌ను దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,356కు పెరిగాయి. కాగా, మరణాలు 273కి చేరాయి. 716 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లోనే 909 కేసులు కొత్తగా నమోదవ్వగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం పేర్కొంది.

మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులు కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో కరోనా కేసులు వెయ్యి మార్క్ దాటగా.. తమిళనాడులో వెయ్యికి చేరువయ్యాయి. ఆదివారం ఉదయానికి మహారాష్ట్రలో కరోనా కేసులు 1,761 నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069కి చేరాయి. కాగా, తమిళనాడులో 969 కేసులు ఇప్పటి వరకు వెలుగుచూశాయి. కరోనా మరణాలు మహారాష్ట్రలోనే భారీగా చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని మొత్తం మరణాల్లో సుమారు సగం ఈ రాష్ట్రంలోనే జరిగాయి. మహారాష్ట్రలో 127 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో 36 మరణాలతో మధ్యప్రదేశ్ ఉన్నది.

Tags: coronavirus, deaths, cases, health ministry, india, surge

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News