పాలకులకు మెరిట్ ఉండాలి.. ఈటల సంచలన కామెంట్లు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెరిట్ లేకుండా ఏ సీటు రాదని, మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని అన్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతోందని, ఉద్యమాలు ప్రజలు చేస్తే వారితో గొంతు కలపాల్సిన అవసరముందన్నారు. దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరముందని ఈటల […]

Update: 2021-04-02 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెరిట్ లేకుండా ఏ సీటు రాదని, మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని అన్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతోందని, ఉద్యమాలు ప్రజలు చేస్తే వారితో గొంతు కలపాల్సిన అవసరముందన్నారు.

దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరముందని ఈటల తెలిపారు. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని, కానీ అది సక్రమంగా అమలు కాలేదన్నారు. సంపద కేంద్రీకరించడమే పేదరికానికి కారణమని, అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికిం పోదని ఈటల వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News