నూతన సంవత్సర శుభాకాంక్షలు : సజ్జనార్

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే ఈసారి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కూడా బాగా తగ్గాయని వెల్లడించారు. గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా తానే పరిశీలించినట్టు తెలిపారు. ఈసారి వేడుకలకు ప్రజలు సహకరించారని అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కేవలం 130 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డారని తెలిపారు. […]

Update: 2021-01-01 02:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే ఈసారి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కూడా బాగా తగ్గాయని వెల్లడించారు. గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా తానే పరిశీలించినట్టు తెలిపారు. ఈసారి వేడుకలకు ప్రజలు సహకరించారని అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కేవలం 130 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డారని తెలిపారు. చివరిగా రాష్ఠ్ర ప్రజలకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News