పార్టీలో సడెన్‌గా కాల్పులు.. ఇద్దరు మృతి

దిశ, వెడ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. షికాగో నగర దక్షిణ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిచించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సూపరింటెండెంట్‌ డేవిడ్‌ బ్రౌన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను […]

Update: 2021-03-14 21:45 GMT

దిశ, వెడ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. షికాగో నగర దక్షిణ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిచించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సూపరింటెండెంట్‌ డేవిడ్‌ బ్రౌన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని అన్నారు. ఘటన స్థలంలో 4 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News