పలు ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ..

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ ఈరోజు నుంచి […]

Update: 2021-04-06 21:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నగరాల్లో సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ ఈరోజు నుంచి ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, జునాగఢ్‌, గాంధీనగర్‌, ఆనంద్ నదియద్‌, మెహసానా, మోర్బీ, దహోద్‌, పఠాన్‌, గోద్రా, భుజ్‌, గాంధీదామ్‌, భరూచ్‌, సురేంద్రనగర్‌, అమ్రేలీ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇప్పటికే అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలను ఈ నెలాఖరు వరకు నిషేధించింది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు 50 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తున్నది.

 

Tags:    

Similar News