టీటీడీ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. పాలకమండలి నిర్ణయాలివే

దిశ, ఏపీ బ్యూరో: జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి రూ.17.40 కోట్లు కేటాయించింది. తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో నూతన పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి కాలిబాట సుందరీకరణకు రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు, టీటీడీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగుల హెల్త్‌ […]

Update: 2021-10-07 09:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి రూ.17.40 కోట్లు కేటాయించింది. తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో నూతన పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి కాలిబాట సుందరీకరణకు రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు, టీటీడీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. వరాహస్వామి విశ్రాంతి భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు, స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని పలు నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయింపులకు టీటీడీ పాలకమండలి ఆమోదముద్ర వేసింది.

Tags:    

Similar News