భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదారి

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 39 అడుగులకు చేరుకుంది. రామాలయం స్నానఘాట్టాల వరకు వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవల కోసం ప్లడ్ డ్యూటీ అధికారులు, సిబ్బంది కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీచేశారు. సిబ్బందికి అన్నిరకాల సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజ్‌ల నుంచి వరదనీరు వస్తున్నందున శుక్రవారం […]

Update: 2021-09-08 08:55 GMT

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 39 అడుగులకు చేరుకుంది. రామాలయం స్నానఘాట్టాల వరకు వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవల కోసం ప్లడ్ డ్యూటీ అధికారులు, సిబ్బంది కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీచేశారు. సిబ్బందికి అన్నిరకాల సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజ్‌ల నుంచి వరదనీరు వస్తున్నందున శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి వరద 43 అడుగులకు చేరే అవకాశం ఉన్నందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. వరద పునరావాస కేంద్రాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్‌‌లను ఆదేశించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08743-323444 లకు ఫోన్ చేయాలని సూచించారు.

Tags:    

Similar News