టీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ  హైదరాబాద్  విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు టీఆర్ఎస్ పార్టీని  చంపడానికి ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని  చంపడానికి ప్రయత్నించిన వారిలో ఈటల రాజేందర్ ఒకరన్నారు. పని చేసే ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను ఈటల రాజేందర్ దద్దమ్మ, చవట, […]

Update: 2021-09-07 01:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు టీఆర్ఎస్ పార్టీని చంపడానికి ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని చంపడానికి ప్రయత్నించిన వారిలో ఈటల రాజేందర్ ఒకరన్నారు. పని చేసే ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను ఈటల రాజేందర్ దద్దమ్మ, చవట, పనికిరానివాడు అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమను ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.

Tags:    

Similar News