బట్టలు ఊడదీసి కట్టెలు, బెల్టుతో దాడి…

దిశ వెబ్ డెస్క్: యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో సీనియర్ విద్యార్థిని కొందరు విద్యార్థులు బలవంతంగా బట్టలు ఊడదీసి కట్టెలతో, బెల్టులతో కొట్టి హింసించారు. పోలీసుల వివరాల ప్రకారం….పదో తరగతి చదువుతున్న బాలికను కలిసేందుకు 12వ తరగతి విద్యార్థి ఒకరు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ బాలికతో అతను మాటల్లో మునిగిపోయాడు. అయితే అదే సమయంలో అక్కడికి పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు చేరుకున్నారు. వెంటనే అతడిపై వారు దాడికి దిగారు. […]

Update: 2020-10-05 05:13 GMT

దిశ వెబ్ డెస్క్:
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో సీనియర్ విద్యార్థిని కొందరు విద్యార్థులు బలవంతంగా బట్టలు ఊడదీసి కట్టెలతో, బెల్టులతో కొట్టి హింసించారు. పోలీసుల వివరాల ప్రకారం….పదో తరగతి చదువుతున్న బాలికను కలిసేందుకు 12వ తరగతి విద్యార్థి ఒకరు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ బాలికతో అతను మాటల్లో మునిగిపోయాడు. అయితే అదే సమయంలో అక్కడికి పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు చేరుకున్నారు. వెంటనే అతడిపై వారు దాడికి దిగారు. కాగా అతన్ని కాపాడేందుకు అతని స్నేహితులు ప్రయత్నించారు. దీంతో అతని స్నేహితులపై కూడా వారు దాడికి దిగారు.

అనంతరం అతన్ని కారులో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి వారు తీసుకు వెళ్లారు. అక్కడ అతని బట్టలు ఊడదీసి కట్టెలు, బెల్టుతో తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలను వారి సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. కాగా అతని ఫోన్ ను తీసుకుని అందులోని కొన్ని ఫోటోలను తమ మొబైల్స్ కు వారు పంపించు కున్నారు. ఆ తర్వాత అతన్ని వారు విడిచిపెట్టారు. కాగా వారిపై పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. అయితే అమ్మాయి విషయంలోనే గొడవలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పథకం ప్రకారమే వారు దాడికి దిగి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News