కరోనా కనుమరుగు అప్పుడేనా..?

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర కమిటీ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా కనుమరుగు అవుతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో వైరస్ ఉధృత దశను దాటుతోందని కమిటీ స్పష్టం చేసింది. అయినా.. అప్పటివరకు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కమిటీ సభ్యులు సూచించారు. ఈ కమిటీకి హైదరాబాద్ ఐఐటీ ప్రెఫెసర్ సారథ్యం వహించడం గమనార్హం. అయితే, ఈ శీతకాలంలో […]

Update: 2020-10-18 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర కమిటీ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా కనుమరుగు అవుతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో వైరస్ ఉధృత దశను దాటుతోందని కమిటీ స్పష్టం చేసింది.

అయినా.. అప్పటివరకు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కమిటీ సభ్యులు సూచించారు. ఈ కమిటీకి హైదరాబాద్ ఐఐటీ ప్రెఫెసర్ సారథ్యం వహించడం గమనార్హం. అయితే, ఈ శీతకాలంలో వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోందని హెచ్చరించారు. ప్రస్తుతం 75 లక్షల్లో ఉన్న కేసులు ఫిబ్రవరి నాటికి కోటీ 5 లక్షలకు చేరవచ్చని అంచనా వేశారు.

Tags:    

Similar News