శుభవార్త : బంగారం ధరలు భారీగా తగ్గినయి
దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో పాటుగా, దేశీయంగా కూడా కొనుగోలు తగ్గిపోవడంతో ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ. 46,920కి చేరింది. 10 గ్రాముల 24క్యారెట్ల […]
దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో పాటుగా, దేశీయంగా కూడా కొనుగోలు తగ్గిపోవడంతో ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ. 46,920కి చేరింది. 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 260 తగ్గి రూ.51,200 కి చేరింది. అయితే, బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం పెరగడం విశేషం. కిలో వెండి ధర రూ. 50 పెరిగి రూ.51,950కి చేరింది.