నిజాంసాగర్ గేట్ల నిర్వహణ అధ్వానం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై గోదావరి వ్యాలీ కమిషనర్ మధుసూదన్ రావు మండిపడ్డారు. ఆయన గురువారం ప్రాజెక్టును తనిఖీ చేశారు. వరద గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో మంజీర నదికి వరద రావడం లేదని, అక్టోబర్‌లో నిజాంసాగర్‌కు సింగూరు నుంచి నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం పొచారం ప్రాజెక్టును […]

Update: 2020-08-20 07:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై గోదావరి వ్యాలీ కమిషనర్ మధుసూదన్ రావు మండిపడ్డారు. ఆయన గురువారం ప్రాజెక్టును తనిఖీ చేశారు. వరద గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో మంజీర నదికి వరద రావడం లేదని, అక్టోబర్‌లో నిజాంసాగర్‌కు సింగూరు నుంచి నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం పొచారం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్టును తనిఖీ చేశారు.

Tags:    

Similar News