బాలసదన్ నుంచి బాలిక మిస్సింగ్.. అసలేం జరిగింది..?

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాలసదన్ నుంచి ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. నిజామాబాద్ బాలసదన్ నుండి కవిత (10 ) సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి కనిపించకుండా పోయింది. బాలిక కోసం చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో బాలసదన్ సూపరిండెంట్ స్వర్ణలత పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు […]

Update: 2021-09-20 10:45 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాలసదన్ నుంచి ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. నిజామాబాద్ బాలసదన్ నుండి కవిత (10 ) సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి కనిపించకుండా పోయింది. బాలిక కోసం చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో బాలసదన్ సూపరిండెంట్ స్వర్ణలత పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ టౌన్ ఎస్సై వారాణాసీ సంతోష్ కుమార్ తెలిపారు. కవితను రైల్వే చైల్డ్ లైన్ వారు వసతి నిమిత్తం బాలసదన్ లో ఉంచగా కనిపించకపోవడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News