సీఎం సహాయనిధికి జీహెచ్ఎంసీ కార్మికురాలి విరాళం

దిశ, న్యూస్‌బ్యూరో: జియాగూడకు చెందిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు అలివేలు తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి అండగా తన నెల జీతం రూ.12వేల నుంచి రూ.10వేలను సీఎం సహాయనిధికి అందజేశారు. చెక్కును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం అందజేయగా ఆయన అభినందించారు. తన ఆలోచనకు భర్త శ్రీశైలం, పిల్లలు శివప్రసాద్, వందన అండగా నిలిచారని అలివేలు వివరించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి […]

Update: 2020-04-28 08:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: జియాగూడకు చెందిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు అలివేలు తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి అండగా తన నెల జీతం రూ.12వేల నుంచి రూ.10వేలను సీఎం సహాయనిధికి అందజేశారు. చెక్కును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం అందజేయగా ఆయన అభినందించారు. తన ఆలోచనకు భర్త శ్రీశైలం, పిల్లలు శివప్రసాద్, వందన అండగా నిలిచారని అలివేలు వివరించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

Tags: GHMC, sanitaion, KTR, CM relief fund, Bonthu

Tags:    

Similar News