అక్రమ వెంచర్లపై GHMC కొరడా.. భారీగా కూల్చివేత

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: అనుమతి లేని వెంచర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ కల్సా మొఘల్ కాలనీ 103/3/P ,172,173 సర్వే నెంబర్‌లలోని దాదాపు పది ఎకరాల స్థలంలో ప్రైడ్ ఇండియా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్ పనులు కొనసాగిస్తున్నారు. అధికారులు హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ, ప్రహారీ పనులు ఆగడం లేదు. ఈ […]

Update: 2021-10-26 03:01 GMT

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: అనుమతి లేని వెంచర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ కల్సా మొఘల్ కాలనీ 103/3/P ,172,173 సర్వే నెంబర్‌లలోని దాదాపు పది ఎకరాల స్థలంలో ప్రైడ్ ఇండియా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్ పనులు కొనసాగిస్తున్నారు. అధికారులు హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ, ప్రహారీ పనులు ఆగడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులు, రెండు పర్యాయాలు వెంచర్ నిర్వాహకులకు నోటీసులిచ్చారు. అయినప్పటికీ, నిర్మాణాలు ఆగకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాణి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తుతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రహరీలు, రోడ్లతో పాటు డివైడర్‌లను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. వెంచర్ పనులను తిరిగి కొనసాగిస్తే నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాణి హెచ్చరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News