ఆసక్తికరమైన మ్యాచ్.. చివరకు డ్రా
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లోనే అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ గురువారం తిలక్ మైదాన్‌లో గోవా ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ మధ్య జరిగింది. 2-2తో డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ నమోదైనా.. దానిలో ఒక్క గోల్ మాత్రమే ఆటగాడు కొట్టాడు. రెండు గోల్స్ పెనాల్టీ కాగా, మరొకటి ఓన్ గోల్ కావడం గమనార్హం. టాస్ గెలిచిన నార్త్’స్ట్ యునైటెడ్ క్లబ్ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకున్నాడు. టాప్ 4లో ఉన్న గోవా […]
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లోనే అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ గురువారం తిలక్ మైదాన్‌లో గోవా ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ మధ్య జరిగింది. 2-2తో డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ నమోదైనా.. దానిలో ఒక్క గోల్ మాత్రమే ఆటగాడు కొట్టాడు. రెండు గోల్స్ పెనాల్టీ కాగా, మరొకటి ఓన్ గోల్ కావడం గమనార్హం. టాస్ గెలిచిన నార్త్’స్ట్ యునైటెడ్ క్లబ్ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకున్నాడు. టాప్ 4లో ఉన్న గోవా ఎఫ్‌సీ మరింత ముందుకు దూసుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పని సరి. దీంతో మొదటి నుంచి దూకుడుగా ఆడింది. 21వ నిమిషంలో ఆల్బెర్టో ఇచ్చిన పాస్‌ను అలెగ్జాండర్ జేసురాజ్ గోల్‌గా మలిచి గోవాకు 1-0 ఆధిక్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇక 41వ నిమిషంలో నార్త్ఈస్ట్‌కు పెనాల్టీ లభించింది.
ఫెడ్రికో గలేగో పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్కోర్లు 1-1గా సమయం అయ్యాయి. రెండో అర్దభాగంలో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో నార్త్ఈస్ట్ ఆటగాడు గుర్జిందర్ కుమార్ సొంత గోల్ పోస్టులోకి బంతిని తరలించడంతో గోవా జట్టుకు గోల్ లభించింది. ఆ తర్వాత 80వ నిమిషంలో నార్త్ఈస్ట్‌కు పెనాల్టీ లభించింది. మరోసారి ఫెడ్రికో గలేగో ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ చేశారు. దీంతో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. నిర్ణీత సమయం ముగిసే సమయానికి 2-2తో గోల్స్ సమానంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు జార్జ్ ఆర్టిజ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఫెడ్రికో గలేగో గెలుచుకున్నారు.