గణేశ్, మొహర్రం వేడుకలు కాన్సిల్ : డీడీఎంఏ

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరాదని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (డీడీఎంఏ) ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. గణేష్ ఉత్సవాలు దగ్గరపడుతున్నందున ఈసారి వేడుకలు నిర్వహించరాదని,  ఢిల్లీలో మెుహర్రం ఊరేగింపు కూడా  ఉండబోదని అందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది. వినాయక చవితి పండుగకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది.  బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాలను పెట్టరాదని.. నిమజ్జనాలు కూడా ఉండవని […]

Update: 2020-08-16 06:54 GMT
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరాదని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (డీడీఎంఏ) ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. గణేష్ ఉత్సవాలు దగ్గరపడుతున్నందున ఈసారి వేడుకలు నిర్వహించరాదని, ఢిల్లీలో మెుహర్రం ఊరేగింపు కూడా ఉండబోదని అందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది.
వినాయక చవితి పండుగకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాలను పెట్టరాదని.. నిమజ్జనాలు కూడా ఉండవని స్పష్ట చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగడం, కమ్యూనిటీ సెలబ్రేషన్లు, విగ్రహాల నిమజ్జనాలు ఈ ఏడాది నిరాకరిస్తున్నామని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ కూడా స్పష్టంచేసింది. ఢిల్లీ ప్రజలు తమ ఇళ్లలోనే బకెట్లు, కంటైనర్లలో విగ్రహాలు నిమజ్జనం చేసుకోవాలని, నిబంధనలను అత్రికమించే వారిపై రూ.5,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా కాలుష్య నివారణకు అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చింది.
Tags:    

Similar News