మాజీ WWE స్టార్ హ్యారీస్ ఇకలేరు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్టార్ రెజ్లర్ జేమ్స్ హ్యారిస్ (James harries) మృతి చెందారు. కామాల (Kaamala) అనే పేరుతో హ్యారిస్‌ పాపులర్ (Famous) అయిన విషయం తెలిసిందే. అయితే 2011లో డయాబెటీస్ (Suger), రక్తపోటు(Blood plessure) కారణంగా ఆయన ఎడమ కాలును వైద్యులు తొలగించారు. దీంతో ఆయనకు ఎంతో ఇష్టమైన రెజ్లింగ్‌ (Wresling) కు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన […]

Update: 2020-08-10 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్టార్ రెజ్లర్ జేమ్స్ హ్యారిస్ (James harries) మృతి చెందారు. కామాల (Kaamala) అనే పేరుతో హ్యారిస్‌ పాపులర్ (Famous) అయిన విషయం తెలిసిందే. అయితే 2011లో డయాబెటీస్ (Suger), రక్తపోటు(Blood plessure) కారణంగా ఆయన ఎడమ కాలును వైద్యులు తొలగించారు.

దీంతో ఆయనకు ఎంతో ఇష్టమైన రెజ్లింగ్‌ (Wresling) కు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం కన్నుమూశారు.

ఇదిలా ఉంటే హ్యారిస్ రెజ్లర్‌గా ఉన్నప్పుడు ఉగాండా యుద్ధ వీరుడి (Warriour) వేషంలో చాలా పాపులర్ అయ్యారు. చేతిలో బల్లెం, డాలు, శరీరం నిండా పెయింట్‌, సింహపు చర్మం వంటి దుస్తులతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించేవారు. ఆయన మరణవార్త వినగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News