Bengal ex CM Buddhadeb Bhattacharya : క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

కోల్‌కతా: కరోనా బారిన పడ్డ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం దిగ్గజ నేత బుద్దదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితులు దిగజారడంతో మంగళవారం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఆక్సిజన్ లెవెల్స్ 90కి తక్కువగా పడిపోవడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిందిగా వైద్యులు బుద్దదేవ్ కు సూచించారు. గతవారం పాజటివ్‌గా తేలినప్పటి నుంచి ఆయన హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు. కానీ, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఆరోగ్యం మరింత క్షీణించడంతో కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల […]

Update: 2021-05-25 06:31 GMT

కోల్‌కతా: కరోనా బారిన పడ్డ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం దిగ్గజ నేత బుద్దదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితులు దిగజారడంతో మంగళవారం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఆక్సిజన్ లెవెల్స్ 90కి తక్కువగా పడిపోవడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిందిగా వైద్యులు బుద్దదేవ్ కు సూచించారు. గతవారం పాజటివ్‌గా తేలినప్పటి నుంచి ఆయన హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు. కానీ, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఆరోగ్యం మరింత క్షీణించడంతో కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత జాయిన్ అయ్యారు.

భట్టాచర్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ రూపాలీ బసు వెల్లడించారు. ఆయనకు చికిత్సనందించడానికి నలుగురు డాక్టర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 18న బట్టాచర్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్యకూ పాజిటివ్ వచ్చింది. వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో ఆయన భార్య చికిత్స చేయించుకోగా, భట్టాచార్య హోం ఐసోలేషన్‌లో వెళ్లారు. ప్రస్తుతం ఆయన భార్యకు కరోనా నెగెటివ్ వచ్చింది.

Tags:    

Similar News