సహనంతో ఉండండి.. టీమిండియాకు కపిల్ దేవ్ హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: గతకొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత బౌలర్లు బాగా రాణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మంగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు. కీపర్ రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకోవాలి, కోహ్లీ వ్యూహాలు రచించాలని అన్నారు. భారత జట్టు అదృష్టాన్ని బ్యాటింగే నిర్ణయిస్తుందన్నాడు. ఇంగ్లండ్‌లో వాతావరణం […]

Update: 2021-05-30 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతకొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత బౌలర్లు బాగా రాణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మంగా ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు. కీపర్ రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకోవాలి, కోహ్లీ వ్యూహాలు రచించాలని అన్నారు. భారత జట్టు అదృష్టాన్ని బ్యాటింగే నిర్ణయిస్తుందన్నాడు.

ఇంగ్లండ్‌లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతుందని, కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని సూచించాడు. భారత బ్యాటింగ్ గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ సిరీస్‌లో బ్యాటింగే కీలకం అన్నారు. అంతేగాకుండా.. కెప్టెన్‌ కోహ్లీ ఎక్కువ దూకుడుగా ఉండొద్దని హెచ్చరించాడు. కోహ్లీ ఎంత సహనంతో వ్యవహరిస్తే, అంత అద్భుతమైన వ్యూహాలు రచించగలడని అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News