అటవీ అధికారులపై అర్ధరాత్రి దాడి

దిశ, నల్లగొండ: జిల్లాలో అర్ధరాత్రి అటవీ అధికారులపై దాడి కలకలం రేపింది. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 15 మంది.. అటవీ అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. అక్రమ నాపరాయి రవాణాను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై గ్రామానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. అటవీ సిబ్బంది బీట్ పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. రెండు ట్రాక్టర్లలో నాపరాళ్లను తరలిస్తుండగా అడ్డుకున్నారు. అనంతరం ట్రాక్టర్లను […]

Update: 2020-06-04 04:47 GMT

దిశ, నల్లగొండ: జిల్లాలో అర్ధరాత్రి అటవీ అధికారులపై దాడి కలకలం రేపింది. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 15 మంది.. అటవీ అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. అక్రమ నాపరాయి రవాణాను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై గ్రామానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. అటవీ సిబ్బంది బీట్ పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. రెండు ట్రాక్టర్లలో నాపరాళ్లను తరలిస్తుండగా అడ్డుకున్నారు. అనంతరం ట్రాక్టర్లను స్టేషన్​కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో సర్పంచ్ భర్త తన అనుచరులతో వచ్చి అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్న అటవీ సిబ్బంది మిర్యాలగూడ ఆస్పత్రికి చేరుకుని చికిత్స తీసుకున్నారు. అనంతరం మిర్యాలగూడ రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News