శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫారిన్ కరెన్సీ సీజ్

దిశ, రాజేంద్రనగర్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు ఓ యువకుడు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగుచూసింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబుదాబి విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ (EY-274) విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికుడు అలియ భాను పై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా.. అతని లగేజ్ బ్యాగులో రూ. 10,09,495 విలువ చేసే 50,500 సౌదీ రియాల్స్‌ను గుర్తించి,  స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు […]

Update: 2021-10-25 08:00 GMT

దిశ, రాజేంద్రనగర్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు ఓ యువకుడు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగుచూసింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబుదాబి విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ (EY-274) విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికుడు అలియ భాను పై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా.. అతని లగేజ్ బ్యాగులో రూ. 10,09,495 విలువ చేసే 50,500 సౌదీ రియాల్స్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News