కరోనా ఎఫెక్ట్.. ఫుడ్ డెలివరీ ఇలా చేస్తున్నారు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కరోనా ధాటికి వ్యవస్థలోని అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇన్ని రోజులు ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిన్న ప్రజలు ఇప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ ఆ ఫుడ్ సరఫరా విషయంలో సందేహాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు […]

Update: 2020-03-15 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కరోనా ధాటికి వ్యవస్థలోని అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇన్ని రోజులు ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిన్న ప్రజలు ఇప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ ఆ ఫుడ్ సరఫరా విషయంలో సందేహాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. బెంగళూరులో కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో..ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం స్విగ్గీ తమ వినియోగదారులకు ఫుడ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను వివరిస్తూ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపించారు. జొమాటో సైతం ఇలాంటి చర్యలనే చేపడుతోంది.

సాధారణంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టే ఫుడ్ ఎంత పరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేశినప్పటికీ..ఆ తర్వాత వినియోగదారుడికి చేరే ప్రక్రియలోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కరోనా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖా సూచనల ప్రకారమే శుభ్రతా, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎవరైన ఫుడ్ ఆర్డర్ పెట్టినపుడు డెల్వరీ చేసే వ్యక్తి నుంచి దాన్ని అందుకునే విధంగా కాకుండా పరోక్ష పద్ధతిలో ఫుడ్‌ని అందుకునే సౌకర్యాన్ని సంస్థలు అందిస్తున్నాయి. దీన్ని ‘డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్’ అనే ఫీచర్‌లో సెలెక్ట్ చేసుకోవాలని జొబాంటో సీఈవో స్వయంగా వివరించారు. ఈ ఫీచర్‌ని ఎంచుకున్న వినియోగదారుడికి ఫుడ్ తెచ్చిన ఉద్యోగి ఇంటి బయటి ప్రదేశంలో శుభ్రమైన చొట ఉంచి, ఫోటో తీసి పంపిస్తాడు. ఆ తర్వాత కస్టమర్ తనకు నచ్చినప్పుడు వచ్చి ఫుడ్‌ని తీసుకోవచ్చు.

డెలివరీ ఉద్యోగుల రక్షణ..

అంతేకాకుండా..ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగుల విషయంలో కూడా తాము జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. డెలివరీ చేసే ఉద్యోగులకు అనారోగ్యం ఉంటే ఇంటికే పరిమితమయ్యేలా, వెంటనే డాక్టర్‌ని కలిసే వెసులుబాటుని ఇస్తున్నారు. ఎవరికైనా కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే, ఆర్థికంగా భయపడి ఉద్యోగం చేసే అవసరం లేకుండా సంస్థలే ఆర్థిక సహకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీలు స్పష్టం చేశాయి. డెలివరీ ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉండేలా చూసుకుంటున్నట్టు తెలిపాయి.

tags : coronavirus, coronavirus effect, food delivery, corona effect on online food compenies
CORONAVIRUS , CORONAVIRUS IN NY , FOOD DELIVERY

Tags:    

Similar News