ఈ రోడ్డుపై నడిచేదెలా.. మొరపెట్టుకున్నా పట్టించుకోరా?

దిశ, అనంతగిరి: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తో్న్న విషయం తెలిసిందే. దీంతో ఇళ్లలోకి వర్షపునీరు చేరి జలమయమయ్యాయి. సూర్యాపేట జల్లా అనంతగిరి మండల పరిధి ఖానాపురం గ్రామంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కొత్తూరు కాలనీ 8వ వార్డులోని రహదారి బురదమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పాలకవర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వార్డు సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం అయితే ఈ రోడ్డు […]

Update: 2021-09-06 08:04 GMT

దిశ, అనంతగిరి: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తో్న్న విషయం తెలిసిందే. దీంతో ఇళ్లలోకి వర్షపునీరు చేరి జలమయమయ్యాయి. సూర్యాపేట జల్లా అనంతగిరి మండల పరిధి ఖానాపురం గ్రామంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కొత్తూరు కాలనీ 8వ వార్డులోని రహదారి బురదమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పాలకవర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వార్డు సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం అయితే ఈ రోడ్డు మార్గంలో నడవాలంటే నరకం చూస్తున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామసభలో ప్రస్తావించాం

ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలుమార్లు గ్రామ సర్పంచ్, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై గ్రామసభలో కూడా పలుమార్లు ప్రస్తావించాం. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి సీసీ రోడ్డు వేయాలి. అప్పటి వరకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలి. – అలవాల సైదులు, ఖానాపురం గ్రామం

Tags:    

Similar News