కేటీఆర్ ఇలాకాలో వరద బీభత్సం.. ఇళ్లలోకి కొట్టుకొచ్చిన చేపలు.(వీడియో)

దిశ, సిరిసిల్ల : మూడు రోజులుగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తం కాగా చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఫలితంగా చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని కాలనీ వాసులు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. సిరిసిల్ల-కరీంనగర్ రహదారి పక్కనే ఉన్న కొత్త […]

Update: 2021-09-05 08:08 GMT

దిశ, సిరిసిల్ల : మూడు రోజులుగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తం కాగా చెరువులు మత్తడి దూకుతున్నాయి.

ఫలితంగా చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని కాలనీ వాసులు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. సిరిసిల్ల-కరీంనగర్ రహదారి పక్కనే ఉన్న కొత్త చెరువు నిండి మత్తడి దూకింది.

దీంతో చేపలు రోడ్ల మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని పట్టుకునేందకు జనాలు రోడ్ల మీద పరుగులు పెట్టారు. అందిన కాడికి చేపలను చేతపట్టుకొని ఇళ్లకు చేరారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News