మాస్కులు కుట్టిన ప్రథమ పౌరురాలు

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్ తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలోని షెల్టర్ హోమ్‌లలో పంపిణీ చేసేందుకు ఆమె స్వయంగా.. మాస్కులు కుట్టారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని శక్తి హాత్‌లో ఆమె బుధవారం మాస్కులు కుట్టారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డుకు చెందిన షెల్టర్ హోమ్‌లలో పంపిణీ చేయనున్నారు. ఎరుపు రంగు మాస్కుతో ముఖాన్ని కవర్ చేసుకున్న సవితా కోవింద్.. స్టిచింగ్ మెషిన్‌పై మాస్కులు కుడుతూ కనిపించారు. మహమ్మారి కరోనావైరస్‌పై […]

Update: 2020-04-23 02:04 GMT

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్ తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలోని షెల్టర్ హోమ్‌లలో పంపిణీ చేసేందుకు ఆమె స్వయంగా.. మాస్కులు కుట్టారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని శక్తి హాత్‌లో ఆమె బుధవారం మాస్కులు కుట్టారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డుకు చెందిన షెల్టర్ హోమ్‌లలో పంపిణీ చేయనున్నారు. ఎరుపు రంగు మాస్కుతో ముఖాన్ని కవర్ చేసుకున్న సవితా కోవింద్.. స్టిచింగ్ మెషిన్‌పై మాస్కులు కుడుతూ కనిపించారు. మహమ్మారి కరోనావైరస్‌పై ప్రతి ఒక్కరూ తమవంతుగా బాధ్యతను నిర్వర్తించేందుకు సంకేతంగా ఈ చర్య నిలుస్తున్నది.

tags: president, first lady, savita kovind, stitch, masks, shelter homes, delhi

Tags:    

Similar News