అదిరిపోయిన అదృష్టం.. సర్పంచుగా సరికొత్త రికార్డు

          మధ్యప్రదేశ్‌లోని దన్సారీ గ్రామాన్ని ఇటీవల గ్రామ పంచాయతీగా ప్రకటించారు. అయితే గ్రామానికి కాబోయే మొదటి సర్పంచు ఒక సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అతని పేరు లాలు. ఇంకా ఎన్నికలు అవలేదు కానీ లాలు సర్పంచ్ కాకుండా ఎవరూ ఆపలేరు.           ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. ఆ గ్రామంలో ఎస్టీలలో ఓటు హక్కు ఒకే ఒక వ్యక్తి లాలు. […]

Update: 2020-02-09 10:38 GMT

మధ్యప్రదేశ్‌లోని దన్సారీ గ్రామాన్ని ఇటీవల గ్రామ పంచాయతీగా ప్రకటించారు. అయితే గ్రామానికి కాబోయే మొదటి సర్పంచు ఒక సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అతని పేరు లాలు. ఇంకా ఎన్నికలు అవలేదు కానీ లాలు సర్పంచ్ కాకుండా ఎవరూ ఆపలేరు.

ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. ఆ గ్రామంలో ఎస్టీలలో ఓటు హక్కు ఒకే ఒక వ్యక్తి లాలు. అయితే ఇక్కడ లాలు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అతను పుట్టుకతో మూగ, చెవిటి వాడు. కాబట్టి దేశంలో తొలి మూగ, చెవిటి సర్పంచుగా నిలిచిపోబోతున్నాడు. 1000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో లాలుని సర్పంచుగా ఎన్నుకుంటామని గ్రామస్తులు కూడా అంటున్నారు. నామినేషన్ వేసి, సర్పంచుగా ఎన్నికై గ్రామంలో ఉన్న తనలాంటి రైతులకు సేవ చేయడం మీద ప్రధానంగా దృష్టిసారిస్తానని లాలు అంటున్నారు.

Tags:    

Similar News