ఏపీలో తొలి కరోనా మృతి

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోన వైరస్ మృతి కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 161 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు కరోనా మృతి నమోదు కాలేదు. విశాఖలో ఒకరు, రాజమండ్రిలో ఒకరు కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా భయంతో ఉన్న ప్రజల్లో అధైర్యాన్ని నింపుతూ ఏపీలో తొలి కరోనా మృతి నమోదైంది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి […]

Update: 2020-04-03 04:41 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోన వైరస్ మృతి కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 161 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు కరోనా మృతి నమోదు కాలేదు. విశాఖలో ఒకరు, రాజమండ్రిలో ఒకరు కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా భయంతో ఉన్న ప్రజల్లో అధైర్యాన్ని నింపుతూ ఏపీలో తొలి కరోనా మృతి నమోదైంది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తొలి మరణం నమోదైంది. మరోవైపు ఢిల్లీ లోని మర్కజ్‌లో పాల్గొన్న వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా 161 మందికి సోకితే అందులో 142 మంది ఢిల్లీలోని తబ్లిగి జమాత్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం విశేషం.

Tags : coronavirus death, man dead, vijayawada, ggh

Tags:    

Similar News