కొవిడ్ ఆస్పత్రిలో అగ్నికీలలు.. 10 మంది పేషంట్లు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది పేషంట్లు మృతి చెందారు. ఇందులో ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతూ మరణించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక డ్రీమ్స్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మూడో అంతస్తులో ఉన్న హాస్పిటల్‌ వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని […]

Update: 2021-03-25 20:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది పేషంట్లు మృతి చెందారు. ఇందులో ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతూ మరణించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక డ్రీమ్స్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మూడో అంతస్తులో ఉన్న హాస్పిటల్‌ వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇరవైకి పైగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

తమ ఆస్పత్రిలో ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొవిడ్‌తో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను అగ్నిప్రమాదం తర్వాత బయటకు తీసుకొచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 76 మంది పేషంట్లను రక్షించామని తెలిపాయి. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలాన్ని ముంబయి మేయర్​ కిషోరీ పడ్నేకర్​పరిశీలించారు. మాల్‌లో ఆస్పత్రిలో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News