బ్రేకింగ్ : అరబిందో ఫార్మాలో మరోసారి తప్పిన పెనుప్రమాదం
దిశ, జడ్చర్ల : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా కంపెనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలోని కోల్డ్ స్టోరేజ్‌లో కోల్డ్ షిట్లను భద్రపరిచే గదిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కంపెనీకి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో కంపెనీ మొత్తం వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ మంటలు […]
దిశ, జడ్చర్ల : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా కంపెనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలోని కోల్డ్ స్టోరేజ్‌లో కోల్డ్ షిట్లను భద్రపరిచే గదిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కంపెనీకి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో కంపెనీ మొత్తం వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఒకవేళ మంటలు అదుపులోకి రాకుండా కంపెనీ మొత్తం వ్యాప్తి చెంది ఉంటే బాయిలర్లు, సిలిండర్లు పేలి పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. టెక్నికల్ సమస్య వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని కంపెనీ సిబ్బంది అనుమానిస్తున్నారు. కాగా, ఇదే కంపెనీకి చెందిన ఓ భవనంలో గతేడాది ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఈ ఘటనలోనూ ఎవరికీ ప్రమాదం సంభవించకపోవడంతో కార్మికులు, కంపెనీ యజమాజ్యం ఊపిరి పీల్చకుంది. అరబిందో కంపెనీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.