మాస్కు లేకుంటే రూ.2 వేలు ఫైన్

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, మాస్కు పెట్టుకోని వారికి రూ.2వేల జరిమానా విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ […]

Update: 2020-11-19 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, మాస్కు పెట్టుకోని వారికి రూ.2వేల జరిమానా విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Tags:    

Similar News