భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌ కోక్స్ బంజారాలోని రోహింగ్యా శరణార్థుల క్యాంపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది సజీవదహనం కాగా 400 మంది జాడ తెలియడం లేదు. అలాగే 560 మంది తీవ్రంగా గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రమాదంలో నాలుగు ఆసుపత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు కాలి బూడిదైనట్టు అధికారులు పేర్కొన్నారు. కానీ మరణాల విషయంలో స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంకా చేయలేదు. అయితే మయన్మార్ నుంచి రోహింగ్యాలు […]

Update: 2021-03-23 22:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌ కోక్స్ బంజారాలోని రోహింగ్యా శరణార్థుల క్యాంపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది సజీవదహనం కాగా 400 మంది జాడ తెలియడం లేదు. అలాగే 560 మంది తీవ్రంగా గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రమాదంలో నాలుగు ఆసుపత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు కాలి బూడిదైనట్టు అధికారులు పేర్కొన్నారు. కానీ మరణాల విషయంలో స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంకా చేయలేదు.

అయితే మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలస వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. దాదాపు 45 వేల మంది నివసించే ఈ క్యాంపులో 10 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లన్నీ వెదురు కలపతో నిర్మించడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్‌లోని ఐరాస శరణార్థుల ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్ వాన్ డెర్ క్లావూ తెలిపారు.

Tags:    

Similar News