టేకులపల్లిలో భయం భయం.. వణుకుతున్న ప్రజలు

దిశ, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఫారెస్ట్ రేంజ్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటన మొట్లగూడెం – జంగాలపల్లి బీట్ పరిధిలోని జంగాలపల్లి గేట్ వద్ద శనివారం తెల్లవారు జామున వెలుగుచూసింది. పెద్దపులి రోడ్డు దాటుతుండగా చూసిన అటవీ శాఖ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు వెంటనే సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. పెద్దపులి సంచారం నిజమేనని టేకులపల్లి ఎఫ్ఆర్ఓ ముక్తార్ హుస్సేన్ ధృవీకరించారు. వెంటనే సమీపంలోని గ్రామస్తులను అలర్ట్ చేయడమే కాకుండా […]

Update: 2021-11-20 05:35 GMT

దిశ, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఫారెస్ట్ రేంజ్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటన మొట్లగూడెం – జంగాలపల్లి బీట్ పరిధిలోని జంగాలపల్లి గేట్ వద్ద శనివారం తెల్లవారు జామున వెలుగుచూసింది. పెద్దపులి రోడ్డు దాటుతుండగా చూసిన అటవీ శాఖ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు వెంటనే సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.

పెద్దపులి సంచారం నిజమేనని టేకులపల్లి ఎఫ్ఆర్ఓ ముక్తార్ హుస్సేన్ ధృవీకరించారు. వెంటనే సమీపంలోని గ్రామస్తులను అలర్ట్ చేయడమే కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పెద్దపులి సంచారం గురించి తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది.

epaper – 4:00 PM TS EDITION (20-11-21) చదవండి

Tags:    

Similar News