కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకారం

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాలు శనివారం అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖకు 40 రైతు సంఘాలు లేఖలు రాశాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైతు సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని ఈ సందర్బంగా రైతు సంఘాలు పేర్కొన్నాయి. కొత్త సాగు చట్టాలు, కనీస మద్దతు ధరకు హామీపై చర్చించేందుకు తాము సిద్దమే […]

Update: 2020-12-26 06:37 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాలు శనివారం అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖకు 40 రైతు సంఘాలు లేఖలు రాశాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైతు సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని ఈ సందర్బంగా రైతు సంఘాలు పేర్కొన్నాయి. కొత్త సాగు చట్టాలు, కనీస మద్దతు ధరకు హామీపై చర్చించేందుకు తాము సిద్దమే అని తెలిపాయి. విద్యుత్ బిల్లు2020 ముసాయిదాలో మార్పులపై కూడా చర్చకు సంసిద్దతను వ్యక్తం చేశాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News