పెట్రోల్ మంట.. బైక్ అమ్మి గుర్రం కొన్న రైతు.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక ఒక రైతు బైకును అమ్మి గుర్రాన్ని తెచ్చుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ములకలపల్లి గ్రామానికి చెందిన నరసింహ తన బైక్ విక్రయించి ఒక గుర్రాన్ని కొనుకున్నాడు. గుర్రంపై తన ప్రయాణం కొనసాగిస్తూ నెలకు రూ. 2,000 ఆదా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో గుర్రం తెచ్చుకున్నానని అన్నాడు. గుర్రంపైనే నిత్యవసర సరుకులు, వ్యవసాయానికి అవసరమైన […]

Update: 2021-10-17 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక ఒక రైతు బైకును అమ్మి గుర్రాన్ని తెచ్చుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ములకలపల్లి గ్రామానికి చెందిన నరసింహ తన బైక్ విక్రయించి ఒక గుర్రాన్ని కొనుకున్నాడు. గుర్రంపై తన ప్రయాణం కొనసాగిస్తూ నెలకు రూ. 2,000 ఆదా చేస్తున్నట్లు తెలిపాడు.

ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో గుర్రం తెచ్చుకున్నానని అన్నాడు. గుర్రంపైనే నిత్యవసర సరుకులు, వ్యవసాయానికి అవసరమైన సామాగ్రిని తెచ్చుకొని నెలకు రూ. 2 వేలు మిగిలిస్తున్నట్లు తెలిపాడు. గుర్రానికి కావలసిన దాన వెయ్యి రూపాయలు అవుతోందని నరసింహ వివరించాడు.

Tags:    

Similar News