తప్పుడు పట్టా.. రైతు ఆత్మహత్యాయత్నం

దిశ, కరీంనగర్: తన భూమిని మరొకరి పేరుమీద పట్టా చేసినందుకు కలత చెందిన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 774లోని వ్యవసాయ భూమిని జిల్లల కనకయ్యకు తన 8గుంటల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా పట్టా చేశారని బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశాడు.ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా […]

Update: 2020-06-06 10:40 GMT

దిశ, కరీంనగర్: తన భూమిని మరొకరి పేరుమీద పట్టా చేసినందుకు కలత చెందిన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 774లోని వ్యవసాయ భూమిని జిల్లల కనకయ్యకు తన 8గుంటల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా పట్టా చేశారని బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశాడు.ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని వాపోయాడు.ఈ విషయంపై దరఖాస్తు ఇవ్వాలని అధికారులు తెలపగా ఈ నెల 2న తహశీల్దార్ కార్యాలయంలో ఇచ్చినట్టు తెలిపాడు. అయినప్పటికీ ఇంతవరకు ఆ భూమిపై రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా తమకు వేరే పనులు ఉన్నాయంటూ దాట వేశారని బాధితుడు చెప్పుకొచ్చాడు.చట్ట ప్రకారం వెళితే తనకు న్యాయం జరగదని భావించిన ఆ రైతు చావే శరణ్యం నిర్ణయించుకుని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే సమయంలో స్థానికులు అడ్డుకుని కాపాడారు. విషయం తెలుసుకున్నతహశీల్దారు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బాధితునికి న్యాయం చేస్తానని హామినిచ్చారు.

Tags:    

Similar News