వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా మగ శిశువు మృతిచెందని బంధువులు ఆరోపించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం… కల్హేర్ మండల కేంద్రానికి చెందిన అనిత అనే మహిళ ప్రసవం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించగా, నా డ్యూటీ అయిపోయింది అని ఒకరు, ఇంకా నా డ్యూటీ టైం కాలేదని మరొకరు నిర్లక్ష్యం చేయడం […]

Update: 2020-11-25 08:38 GMT

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా మగ శిశువు మృతిచెందని బంధువులు ఆరోపించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం… కల్హేర్ మండల కేంద్రానికి చెందిన అనిత అనే మహిళ ప్రసవం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించగా, నా డ్యూటీ అయిపోయింది అని ఒకరు, ఇంకా నా డ్యూటీ టైం కాలేదని మరొకరు నిర్లక్ష్యం చేయడం మూలంగా పసికందు మృతిచెందిందని ఆరోపించారు. సరైన సమయంలో ఆపరేషన్ జరిగితే శిశువు బతికేదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని బంధువులు డిమాండ్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News