నాతో లైంగికంగా కలిస్తే అద్భుత శక్తులు వస్తయ్ అంటూ మహిళలపై అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి, బలహీనతలు ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న దొంగ బాబా విశ్వచైతన్యను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ… ఈ దొంగ బాబాకు 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లైంగికంగా కలిస్తే తనకున్న శక్తులు మీకు కూడా వస్తాయని మహిళలను నమ్మించాడని తెలిపారు. అంతేగాకుండా.. మహిళలకు మాయమాటలు చెప్పి వీడియో కాల్స్ చేసేవాడని వెల్లడించారు. మంగళవారం […]

Update: 2021-08-03 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి, బలహీనతలు ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న దొంగ బాబా విశ్వచైతన్యను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ… ఈ దొంగ బాబాకు 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లైంగికంగా కలిస్తే తనకున్న శక్తులు మీకు కూడా వస్తాయని మహిళలను నమ్మించాడని తెలిపారు. అంతేగాకుండా.. మహిళలకు మాయమాటలు చెప్పి వీడియో కాల్స్ చేసేవాడని వెల్లడించారు. మంగళవారం బాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన నుంచి రూ.26 లక్షల నగదు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని రెండో భార్య సుజితపైనా రూ.1.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నట్లు స్పష్టం చేశారు.

అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక ఇబ్బందులు, ఏ ఇతర సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికి అనేక మోసాలకు పాల్పడ్డానని అన్నారు. కాగా, ఈ దొంగ బాబా కృష్ణా జిల్లాకు చెందినవాడని, హైదరాబాదులో పుట్టి పెరిగాడని తెలిపారు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ.కోట్లు వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News