Facebook ban Taliban: తాలిబన్లపై ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తాలిబన్లకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. తాలిబన్లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్ పై కూడా బ్యాన్ విధిస్తూ ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, తాలిబన్లను ఫేస్‌బుక్ ఇప్పటికే తీవ్రవాదులుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఆఫ్ఘాన్ గడ్డపై అమెరికా దళాలు వెనుదిరగడంతో మొదలైన తాలిబన్ల ఆక్రమణ నెమ్మదిగా రాజధాని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తాలిబన్లకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. తాలిబన్లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్ పై కూడా బ్యాన్ విధిస్తూ ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, తాలిబన్లను ఫేస్‌బుక్ ఇప్పటికే తీవ్రవాదులుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది.
అయితే, ఆఫ్ఘాన్ గడ్డపై అమెరికా దళాలు వెనుదిరగడంతో మొదలైన తాలిబన్ల ఆక్రమణ నెమ్మదిగా రాజధాని కాబూల్ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఆ దేశంలో కీలక ప్రాంతాలన్నీ తాలిబన్ల గుప్పెట్లో ఉన్నాయి. ఆ దేశ సైన్యం తాలిబన్లను ఎదుర్కొనలేక చేతులెత్తేయడంతో ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గనీ దేశాన్ని విడిచి అమెరికాకు పారిపోయాడు. ప్రస్తుతం తాలిబన్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్న విషయం తెలిసిందే.