నటిని గర్భవతిని చేసిన మాజీ మంత్రి అరెస్ట్..

దిశ, వెబ్‌డెస్క్: నటి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం బెంగుళూరులోని ఓ ప్రాంతంలో దాక్కున్న ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతకొన్ని రోజుల క్రితం  కోలీవుడ్ నటి చాందిని, ఎం.మణికందన్‌ పెళ్లి పేరుతో మోసం చేశాడని  పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణలోనే పరారీలో ఉన్న మణికందన్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోలీవుడ్ లో స్థానికంగా సంచలనంగా మారిన ఈ […]

Update: 2021-06-20 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: నటి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం బెంగుళూరులోని ఓ ప్రాంతంలో దాక్కున్న ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతకొన్ని రోజుల క్రితం కోలీవుడ్ నటి చాందిని, ఎం.మణికందన్‌ పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణలోనే పరారీలో ఉన్న మణికందన్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోలీవుడ్ లో స్థానికంగా సంచలనంగా మారిన ఈ కేసు లో ఎట్టకేలకు మాజీమంత్రి పట్టుబడ్డాడు.

“మాజీ మంత్రి మణికందన్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకొంటానని చెప్పి తనను లొంగదీసుకున్నాడని, ఐదేళ్లు తనతో సహజీవనం చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని చాందిని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అతని వలన తాను గర్భవతిని కూడా అయ్యానని, కానీ, బలవంతంగా మూడుసార్లు తన గర్భాన్ని తీయించాడని తెలిపింది. ఈ విషయం బయటికి చెప్తే కిరాయి మనుషులతో తనను చంపేస్తానని బెదిరించాడన్న చాందిని తనకు రక్షణ కలిపించాలని పోలీసులను ఆశ్రయించింది.

Tags:    

Similar News