ఉచిత మంచినీటి వసతిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి: రోజాదేవీ
దిశ, శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వినాయక పార్క్ వాటర్ వర్క్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ అవసర వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకంపై జలమండలి అధికారి డిజీఎం వెంకటేశ్వర్లతో కలిసి అవగాహన సదస్సులో స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి […]
దిశ, శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వినాయక పార్క్ వాటర్ వర్క్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ అవసర వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకంపై జలమండలి అధికారి డిజీఎం వెంకటేశ్వర్లతో కలిసి అవగాహన సదస్సులో స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాలనీలు, బస్తీలలో ఎవరైనా ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే వెంటనే చేయించుకోవాలని, కాలనీలో ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధార్ కార్డు లింక్ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రియాంక, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, హరినాథ్, ఆంజనేయులు, మహేష్, పురేందర్ రెడ్డి, శేఖర్, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.