ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలి : జనగామ ఏసీపీ కృష్ణ

దిశ, జనగామ: ప్రతి వాహనానికి వాహనం‌ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ తప్పక ఉండాలని జనగామ ఏసీపీ కృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు నర్మెట్ట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనఖీల్లో భాగంగా 70 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సరైన పత్రాలు లేకుండా నడవడం గుర్తించామని, వాటిపై ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.. రోడ్డు […]

Update: 2021-11-21 01:35 GMT

దిశ, జనగామ: ప్రతి వాహనానికి వాహనం‌ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ తప్పక ఉండాలని జనగామ ఏసీపీ కృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు నర్మెట్ట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనఖీల్లో భాగంగా 70 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సరైన పత్రాలు లేకుండా నడవడం గుర్తించామని, వాటిపై ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.. రోడ్డు భద్రత చట్టప్రకారం ప్రతి ఒక్కరు వాహన లైసెన్స్ లతోపాటు వాహనం నడుపు సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా వాడాలని, వాహనాలకు ఇన్సూరెన్సు ఉండాలని సూచించారు. ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా చేపడతామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం నర్మెట సర్కిల్ ప్రాంతంలో వాహనదారులకు స్థానిక ప్రజలకు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు , ఇద్దరు ఎస్ఐలు, 35 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు నర్మెట పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News